తాడిపల్లి గ్రామంలో 428 మందికి టిభి కళ్ళీ పరీక్ష
రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ :-తాడిపల్లి గ్రామంలో టిభి వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహించి 428 మందికి టిభి కళ్ళే పరీక్షలు చేశారు.అదేవిదంగా డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాలు భాగంగా గ్రామంలో ప్రజలు ఈ వ్యాధికి గురి కాకుండా అవగాహన నిమిత్తం ర్యాలీ చేశారు.అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీటీసీ రెడ్నం సతీష్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణ మన చేతుల్లోనే ఉందని,చుట్టుపక్కల వారం పై నిల్వ ఉన్న నీటిని గుర్తించి వాటిని తొలగించాలని అలానే పరిసరాల్లో వృధా వస్తువులను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.అలాగే ఇంట్లో ఉన్న నీటి తొట్టెలు మీద,ట్యాంకులు మీద,నీటి సంపులు మీద మూతలు కచ్చితంగా అమర్చాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి పై వెల్ల పీహెచ్ ఆరోగ్య సిబ్బంది మరియు పంచాయితీ సిబ్బంది ప్రత్యేక అవగాహన తాడిపల్లి గ్రామ ప్రజలుకి కల్పించాలని తెలియజేశారు.102 లేదా అంత కంటే ఎక్కువ జ్వరము,తలనొప్పి,కీళ్ళు, కండరాలు నొప్పులు, వణుకు,బలహీనత, అలసట,చర్మం పై ఎర్రటి దద్దుర్లు వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలుగా గుర్తించి వారిని మన సమీప ఆరోగ్య కేంద్రం అయిన వెల్ల పీహెచ్ కి తగిన చికిత్స కొరకు తీసుకుని వెళ్ళాలి అని తెలియజేశారు.అక్కడ రక్త పరీక్ష ఎలిసా ద్వారా డెంగ్యూ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు అని ఈ విధంగా డెంగ్యూ వ్యాధిని పూర్తిగా తరిమి కొట్టొచ్చు అని ఎంపీటీసీ రెడ్నం సతీష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వెల్ల పీహెచ్ వైద్య అధికారి డాక్టర్ స్వాతి భవాని, మాజీ కోపరేటివ్ త్రీ మెన్ కమిటీ చైర్మన్ పిల్లి బాలసుబ్రమణ్యం,MLHP ఎమ్ఎల్ఎచ్ పి దివ్య,ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.