దళితులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు – ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్
దళితులపై ఎవరు దాడి చేసిన ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ ను కేఎస్ జవహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడి చేస్తే సహించేది లేదని, వారిపై కఠిన శిక్షలు విధించే విధంగా అధికారులకు సూచిస్తానన్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేశారని మిగిలిన వారికి కూడా శిక్షపడేలా చూస్తానని కేఎస్ జవహర్ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.