తాళ్ళరేవు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. తాళ్ళరేవు మెయిన్ రోడ్ లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని అన్నారు. ఉపాధి హామీని పరిరక్షించుకోవాలని తదితర డిమాండ్లతో తాళ్ళరేవు ఎమ్మార్వో పి త్రినాధరావుకు వినతిపత్రం అందించారు.