14 October 2025
Tuesday, October 14, 2025

తాళ్లూరు లిఫ్ట్ కు ఎం ఎస్ ఐరన్ పైప్ లైన్ వేసేందుకు 52 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పరిపాలన ఆమోదం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ ప్రధాన కాలువ యొక్క కి.మీ 45.195 వద్ద ఉన్న తాళ్లూరు లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఉన్న పి ఎస్ సి ప్రెజర్ మెయిన్‌ను ఎం ఎస్ ప్రెజర్ మెయిన్‌తో భర్తీ చేయడానికి పరిపాలనా ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి 140 కోట్లు రూపాయలు మరో 10 రోజుల్లో పరిపాలన ఆమోదం పొందడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ఇర్రిపాక, మామిడాడ, నరేంద్ర పట్నం, కాండ్రేగుల, గొల్లలగుంట గ్రామాలను కలుపుతూ సాగు నీరు అందించేందుకు జ్యోతుల పాపారావు నీటి పథకం ఈ నెలాఖరులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు హాజరవుతారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo