14 October 2025
Tuesday, October 14, 2025

తామరాడ జడ్పి హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ సెంటర్‌లో ప్రయోగాత్మక శిక్షణ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావు పేటలోని ఏసిటి సైన్స్ సెంటర్‌లో, కిర్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని ఆమ్లాలు,క్షారాలు,లవణాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రయోగాలను సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్దా శ్రీనివాస్ ప్రాయోగికంగా నేర్పించారు.
సహజ సూచికలను ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను గుర్తించడం, ఎర్ర,నీలి లిట్మస్ పేపర్‌లతో పరీక్షించడం, సింథటిక్ ఇండికేటర్ల సహాయంతో ఆమ్ల,క్షారాలను వర్గీకరించడం, వివిధ ద్రవాల పిహెచ్ విలువలను గుర్తించడం, ఆమ్లాలు,క్షారాల ద్వారా విద్యుత్ ప్రవాహం ఎలాజరుగుతుందో తెలుసుకోవడం వంటి ప్రయోగాలు విద్యార్థులు ప్రాక్టికల్‌గా చేసారు.ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రయోగపూర్వకంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం సెషన్‌లో విద్యార్థులు భౌతిక శాస్త్రంలోని రసాయన సమీకరణాలు మరియు చర్యలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రయోగాలను స్వయంగా నిర్వహించారు. విద్యార్థులకు మిషన్ అన్నపూర్ణ సహాయనిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి. అరుణ శంకర్, కె. మహేష్, తామరాడ హై స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ ఎలుగుబంటి శ్రీను, హెచ్.ఎం. కృష్ణ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo