కొవ్వూరు నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నులు వారి సత్రం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు…
నూతన కార్యవర్గం నీతి నిజాయితీలతో పనిచేస్తూ సంస్థ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఉన్న నూలి వెంకటరత్నం సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా బాల దారి ఉమాపతి,తురగా విజయ భాస్కరరావు, తమ్మిర్సి అంజిబాబు, దివిలి సత్యవాణి, కడదారపు నాగమణి, కొల్లి సుజాత, ముప్పన లోకేశ్వర సాంబ శౌర్య, మాదిరెడ్డి కృష్ణవేణి, లచే ఏవో బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నూతన కార్యవర్గ సభ్యులను దుస్సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని సన్నిధిలో పనిచేయడం గొప్ప వరం అని అటువంటి మహోన్నతమైన అవకాశం నూతన కార్యవర్గానికి రావడం అభినందనీయమన్నారు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న నూలు వారి సత్రం ఆస్తులను పరిరక్షిస్తూ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. గతంలో పేద విద్యార్థులకు నిత్యాన్నదానం జరిగేదని కరోనా విపత్కర పరిస్థితుల్లో వాటిని నిలిపివేయడం జరిగిందని నేడు నూతన కార్యవర్గం పేద విద్యార్థులకు నిత్యానుదానాన్ని చేయడంలో తగిన శ్రద్ధ చూపాలన్నారు. విధులు నిర్వహణలో నీతి నిజాయితీలతో నూతన కార్యవర్గం పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, బిజెపి నాయకులు పిల్లలమర్రి మురళీకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, క్లస్టర్ ఇంచార్జ్ పెనుమాక జయరాజు, తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.