నదురుబాద గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ముందుచూపు
ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు
తుఫాను ప్రభావం దృష్ట్యా బయటకు రావద్దని హెచ్చరిక
మొథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందనే ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ఎదురవకూడదనే ఆలోచనతో నదురుబాద గ్రామంలో జనరేటర్ ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం తో మంగళవారం ఉదయం నుండి విద్యుత్ లేనందున త్రాగునీటి ఇబ్బంది ఏర్పడ కూడదని ముందు జాగ్రత్త చర్యలుగా జనరేటర్ ను ఏర్పాటు చేసామని, ఈ జనరేటర్ ద్వారా విద్యుత్ కలెక్షన్ ఇచ్చి త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. తుఫాను ప్రభావం దృష్ట్యా గ్రామ ప్రజలు ఇల్లును విడిచి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నదురుబాద ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసామని అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుపుతూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శ్రీనివాసరావు సూచించారు.

