కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి, ప్రతి ఇంటికి పైపులు ఏర్పాటుచేసి త్రాగునీటి సరఫరా అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యాలను సక్రమంగా అందేలా భాథ్యత లు నిర్వర్తించడం లో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. మండల కేంద్రమైన రాయవరంలో స్థానిక బస్టాండ్ కు ఎదురుగా ఉన్న మఠం వీథిలో కుళాయిలు పాడై విరిగిపోవడం , పైపులు పగిలి పోవడం తో భారీగా త్రాగునీరు వృధాగా పోతుంది,
స్థానికులు వస్త్రాలు, చెక్కలు వంటివి కట్టి నీటి వృధాను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులకు పలుమార్లు పరిస్థితిని వివరించి, సమస్యకు పరిష్కారం చూపాలని కోరినా, తాత్కాలిక మరమత్తులు చేస్తున్నారే తప్ప, శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకెంత నీరు వృధాగా పోతుందో.?
అని పలువురు పరిస్థితిని చూసి చర్చించుకుంటున్నారు. స్థానిక అధికారులు స్పందించి పైప్ లైన్ కు శాశ్వత మరమ్మతులు చేసి, కొత్త ట్యాప్ లు ఏర్పాటు చేయడం ద్వారా నీటి వృధాను అరికట్టాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నారు.

