14 October 2025
Tuesday, October 14, 2025

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనీ తెలిపారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తో మౌలిక వసతులు కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ పేర్కొన్నారు. జిల్లాను సమగ్ర అభివృద్ధి పదంలో నడిపించడంలో అందరి అధికారుల సహకారం తో పనిచేయడం జరుగుతుందని, జిల్లాను అగ్ర గామిగా నిలపడం లో అందరూ సహకరించాలని కోరారు.అంతకుముందు కలెక్టరేట్ చేరుకున్న కలెక్టర్ కీర్తి చేగురికి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతా రామమూర్తి కలెక్టరేట్ ఏవో ఆలీ లు స్వాగతం పలికారు. పదవి బాధ్యతలు స్వీకరించడం ఆర్ డి ఓ రాణి సుస్మిత , ఆర్ కృష్ణ నాయక్, డి ఐ పి ఆర్ ఓ కే లక్ష్మీ నారాయణ, ఇంచార్జి సహాయ సంచాలకులు, డివిజనల్ పీఆర్వో ఎమ్. లక్ష్మణ చార్యులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, ఇతర సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది.

కలెక్టర్ గా కీర్తి చేకూరి నేపథ్యం …..

విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐఐటి మద్రాస్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో మూడు సార్లు ఉత్తీర్ణత సాధించి, 2016లో 14వ ర్యాంక్‌తో IAS‌గా నియమితులయ్యారు. వృత్తిపరమైన క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం కలిగిన అధికారిణిగా పేరు సంపాదించారు. గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా, మదనపల్లెలో సబ్ కలెక్టర్‌గా, ఉమ్మడి తూర్పు గోదావరిలో జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo