ఉపాధిహామీ వేతనదారుల బకాయిలు వెంటనే చెల్లించాలి
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కొత్తూరు సచివాలయం వద్ద శనివారం ఉపాధి హామీ వేతనదారుల బకాయిలు వెంటనే చెల్లించాలనివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి శ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, ఉపాధి హామీ వేతన దారులు రైతులు పాల్గొన్నారు.