చైర్ పర్సన్ రాణి…
కూటమి ప్రభుత్వం వైద్య కళాశాల లను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని దీని వలన పేద ప్రజలకు వైద్య విద్య అందరి ద్రాక్షల మరే అవకాశం ఉందని మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు.
మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్ కాలనీ,30వ వార్డు రాజీవ్ గృహకల్ప లో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మున్సిపల్ చైర్ పర్సన్ రాణి, ఆ వార్డు కౌన్సిలర్, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు.శనివారం ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమం నిర్వహించారు.ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ, వైసిపి టౌన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాసు, షేక్&షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా,30వ వార్డు వైసిపి ఉపాధ్యక్షులు సుంకర శ్రీను,చిక్కం కొండ,బిళ్లకుర్తి పరమేశ్వర రావు,కార్యకర్తలు పేరూరి మాధవి,బత్తిన దొరబాబు,కోమ్మోజు నాగేశ్వరరావు,బలుసుపాటి సూర్యకుమారి,సవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

