01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

వైసిపి నుండి ఎంపీపీ ఉండమట్ల వాసు సస్పెండ్ …

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

తల్లి లాంటి పార్టీ కి ద్రోహం చేస్తే క్రమశిక్ష చర్యలు తప్పవు…

వైసిపి జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

మండపేట మండల పరిషత్ అధ్యక్షులు ఉండమట్ల శ్రీనివాస్ (వాసు) ను వైసిపి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసిపి అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు. విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి,వైసిపి నాయకులు తోట పృధ్వీ రాజ్, చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, జెడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు, వైస్ ఎంపిపి పసుమర్తి నాగేశ్వరరావు తదితరులు తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీ కి నష్టం చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. పార్టీ కి ద్రోహం చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఇటీవల ఎంపిపి వుండమట్ల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై పార్టీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు అందరి తో సమావేశం అయి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాది తిరక్కుండానే టిడిపి కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వుందన్నారు. ప్రజలు ఈ కూటమికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లో విఫలం అయ్యారని ద్వజమెత్తారు.లోకేష్ మోచేతి నీళ్ళు తాగేందుకు ఇక్కడి వైసిపి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరన్నారు. అధికార టీడీపీ ప్రలోబలు పెడుతుందని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగే వారు లేరన్నారు.ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయం చేయండి. దిగజారుడు రాజకీయం వద్దని సూచించారు.పార్టీ కి వెన్నుపోటు పొడవాలని చూస్తే వారే కనుమరుగు అవుతారని హెచ్చరించారు. పార్టీ మారాలని ఎంపీటీసీ లను తీవ్రంగా ప్రలోభ పెట్టారని ఆరోపించారు. వైసిపికి షాక్ ఇద్దామని చెప్పారని కానీ వైసీపీ ఇచ్చే షాక్ ఎలాగుంటుందొ భవిషత్ లో తెలుస్తుందన్నారు. ఎవరు అపోహలకు పోవద్దని కార్యకర్తలు,నాయకులకు స్పష్టత కోసం ఎంపిపి నీ సస్పెండ్ చేస్తూ పార్టీ వేగంగా నిర్ణయం తీసుకుందని వివరించారు.ప్రలోభాలు మానుకోవాలని టిడిపి కి హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు దూలం వెంకన్న బాబు,ఎంపీటీసీలు మండ సుమలత, వనం సత్యవేణి, అన్నందేవుల కృష్ణారావు, చంద్రమల్ల పోతురాజు, చొల్లంగి సత్యవేణి ,పంపన లక్ష్మి, ఉషా రాజేష్ తాతపూడి, పట్నాల నాగ వెంకట సుబ్బారావు, మండల రూరల్ పార్టీ అధ్యక్షులు అడబాల బాబ్జి, పోతుల ప్రసాద్ ,పలివెల సుధాకర్, అద్దంకి రమణ , పోతుల ప్రసాద్ ,పలివెల సుధాకర్,అద్దంకి రమణ,వాసిరెడ్డి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo