శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు
శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెంటనే తీసుకువెళ్లి గౌడ్ తొలగించి శెట్టి బలిజ కులం సర్టిఫికెట్లు ఇప్పించేందుకు విశేష కృషి చేసి జాతికి ఎంతో ఉపకారం చేశారని కొనియాడారు. అన్నదమ్ములుగా ఉండే బీసీ కులాల మధ్య మనస్పర్ధలు వచ్చేలా వైసీపీ పాలనలోనే గౌడ్ ( శెట్టిబలిజ ) కులం సర్టిఫికెట్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారని సాయి ఆవేదన వ్యక్తం చేశారు.. అప్పట్లో పదవులను ఏలుతున్న శెట్టిబలిజ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి సుభాష్ చిత్తశుద్ధితో కృషి చేసి సీఎం ద్వారా పాత జీవోలో మార్పులు చేసి బీసీలకు చెందిన గీత కులాలకు న్యాయం చేశారన్నారు. తాము గౌడ కులానికి వ్యతిరేకం కాదని, ఎప్పటిలాగే శెట్టిబలిజం కులంగా కులం సర్టిఫికెట్లు మాత్రమే కావాలని కోరుకుంటున్నామని సాయి అన్నారు. ఇప్పటివరకు శెట్టిబలిజ కుల బలాన్ని చూపించి నాయకులు పదవులు పొందారని, మంత్రి సుభాష్ కులం కోసం మాత్రమే నిస్వార్ధంగా పనిచేసి చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారని గుత్తుల అభినందించారు. మంత్రి సుభాష్ ను అభినందించి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానించింది. శెట్టి బలిజ నాయకులు శీలం సూర్య నారాయణ, విత్తనాల వెంకటరమణ, కడలి వెంకట సత్యనారాయణ, వనచర్ల నాగేశ్వరరావు, విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు, కముజు సర్వేశ్వరరావు,గొవ్వాల సత్తిబాబు, శీలం ప్రసాద్,కొప్పిశెట్టి ఏడుకొండలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.