అమలాపురం, రాజోలు పరిశీలకులుగా నియామకం…
మండపేట నియోజకవర్గం కు చెందిన వైసిపి సీనియర్ నేత కర్రి పాపారాయుడును పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా నియమించింది. వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పాపారాయుడును రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పరిశీలకులుగా అదనపు బాద్యతలు అప్పగించారు. వైయస్సార్ సిపి సీనియర్ నేత కర్రి పాపారాయుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిస్తూ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రెండు నియోజకవర్గాల పరిశీలకులుగా పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకులకు సహాయకులుగా వ్యవహరించనున్నారు. పాపారాయుడుకు జిల్లాలో కీలక బాద్యతలు అప్పగించడం పట్ల ఆయన అభిమానులు మండపేట వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ఘనంగా దుస్సాలువ, పూలదండలతో సత్కరించి ఆయనపై వాళ్లకున్న అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరావు, మండల వైసిపి కన్వీనర్ అడబాల బాబ్జి, సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, వైసిపి రాష్ట్ర యువజన విభాగ జాయింట్ కార్యదర్శి వాసిరెడ్డి అర్జున్, పార్టీ నాయకులు కురుపూడి రాంబాబు, పెంకే గంగాధరం, వల్లూరి రామకృష్ణ ,పలివెల సుధాకర్, వనుం నారాయణ ,వాసంశెట్టి శ్రీనివాస్, పమిడిపల్లి నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపా రాయుడు మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తానని, కార్యకర్తలు అభిమానులు అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్రం లో జగన్ ను ముఖ్యమంత్రి, మండపేటలో తోట త్రిమూర్తులు ను ఎమ్మెల్యే చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

