నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదు…
యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న దృష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత ప్రతీ రైతుకు ఉందని మండపేట టౌన్, కేశవరం, జెడ్.మేడపాడు, తాపేశ్వరం, ఏడిద పిఎసిఎస్ చైర్మన్ కుక్కల రామారావు , ఉండమట్ల శ్రీనివాస్ రావు,అధ్యక్షులు సలాది బాలసుబ్రహ్మణ్యం,పడాల రామకృష్ణరెడ్డి , గొడవర్తి సత్యనారాయణ (ఎర్రబ్బు) లు అన్నారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికే దుష్ప్రచారాలకు పాలడుతున్నారని దుయ్యబట్టారు. మండపేట నియోజకవర్గంలో ఎక్కడ యూరియా కొరత లేదన్నారు. ప్రతీ రైతుకు యూరియా సక్రమంగా అందించామన్నారు. తొలకరి పంటకు పూర్తి స్ధాయిలో యూరియా అందించటం జరిగిందన్నారు. తొలకరి పంట పూర్తి కావస్తున్నప్పటీకీ ఇంకా ఎవరికైనా యూరియా అవసరమైతే వెంటనే అందించటానికి సిద్దంగా ఉన్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లా గంటల తరబడి క్యూ లైన్లలో ఉండాల్సిన పనిలేదన్నారు. రైతులను అన్ని రకాలుగా ఇబ్బందిపెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇకనైనా వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

