Monday, August 4, 2025
Monday, August 4, 2025

వైసీపీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట

బాబూ జగజ్జీవన్ రామ్ 39 వ వర్థంతి సందర్భంగా పట్టణంలో జాతీయ నాయకుల సెంటర్లో ఉన్న డా.బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విగ్రహాల కమిటీ కన్వీనర్, 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మరియు నియోజకవర్గ ఆర్.టి.ఐ వింగ్ కన్వీనర్ మందపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలసి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని దేశంలో హరిత విప్లవంలో జగజ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారు. స్వతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం, జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయాలకు జగజ్జీవన్ రామ్ ఏకీభవించేవారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో అంకితభావంతో చురుగ్గా పాల్గొనేవారు. 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించిన వారని, ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన దేశానికి విశేషమైన సేవలు చేశారని అన్నారు.1971 లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేసిన సాహస వీరుడు అని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి పార్టీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ జొన్నపల్లి సత్తిబాబు, యర్రగుంట అయ్యప్ప, యరమాటి వెంకన్నబాబు, యర్రవరపు సూరిబాబు, అంధనాపల్లి రవి, రమేష్, శీలి సత్యనారాయణ, చిన్ని విజయ్, దుగ్గిరాల చిన్న పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo