అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్సీపీ కార్యకర్త బత్తిన దొరబాబును మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సోమవారం పరామర్శించారు. అయన స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు పేరూరి మాధవి, కొమ్మోజు నాగేశ్వరరావు, కాకాడ నూకరాజు,మోర్త లక్ష్మి, పీనెడ్డి కృపావతి, పిల్లి శివ కనకవరాలు తదితరులు పాల్గొన్నారు.

