30వ వార్డు కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ వైసీపీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత కట్టబెట్టిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మండపేట వైసీపీ ఇన్ చార్జి, పార్టీ సలహాదారుల కమిటి మెంబర్, రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా, తోట త్రిమూర్తులు మండపేట నుండి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పాటు పడతానని ఆయన స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం ఐ.టి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ సత్యనారాయణ పార్టీ ఆవిర్భావం నుండి అంటిపెట్టుకుని ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారని కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ తనదైన ముద్ర వేసుకున్నారని తెలుపుతూ అభినందనలు తెలిపారు. సత్యనారాయణ నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు ముమ్మిడివరపు బాపిరాజు, మొండి మురళి, షేక్ అలీఖాన్ బాబా, పోతంశెట్టి ప్రసాదులు, తమ హర్షం వ్యక్తం చేశారు.