ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యదర్శులను నియమించడం జరిగింది ఇందులో భాగంగా మండపేట కు చెందిన టేకిమూడి శ్రీనును జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం వైయస్సార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను, చైర్ పర్సన్ ఛాంబర్ లో చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నియమించిన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డిను, జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డిను, మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ పెట్టిన బాధ్యతను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శయశక్తుల శ్రమిస్తానని, అర్హత గల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందని ప్రజల పక్షాన ఉండి పోరాడి సాధిస్తామన్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన శ్రీనుని రెడ్డి రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన విభాగం చోడే శ్రీకృష్ణ, 8వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్,18 వ వార్డు ఇంచార్జ్ యర్రగుంట అయ్యప్ప, సాధనాలు శివ భగవాన్ తదితరులు పాన్నారు.