పార్టీ కార్యక్రమాలలో పూల వర్షాలతో జోష్ నింపిన వ్యక్తిగా గుర్తింపు…
రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అత్యంత సన్నిహితుడిగా, రేవు శ్రీను కు ముఖ్య అనుచరుడిగా వైయస్సార్ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అంజూరి శ్రీనివాస్ చౌదరి.అయన తన వ్యక్తిగత కారణాలు దృష్ట్యా నేటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు స్థానిక విలేకరులకు సోమవారం తెలిపారు.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 వార్డు గెలుపు కోసం కీలకపాత్ర పోషించాడు.ప్రతి గడపగడపకు తిరిగి తోట త్రిమూర్తులు విజయ కోసం రాత్రి పగలు తారతమ్యం లేకుండా అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా పేరు పొందాడు .పార్టీ కార్యక్రమాలలో సొంత నిధులతో పూల వర్షం కురిపిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న అంజూరి శ్రీనివాస్ చౌదరి. సహాయం అని కోరి వచ్చిన ప్రజలకు తనదైన శైలిలో చేయూతగా అయ్యి ప్రజలందరి మన్ననాలు పొందాడు.ఆయన వైయస్సార్ పార్టీ నుండి తప్పుకుంటునట్లు తెలిసిన తోటి వైసిపి కార్యకర్తలు, నాయకులు, విచారణ వ్యక్త పరిచారు
 
     
  
 
         
             
             
             
             
                                    
 
       
       
  
 
                    
                 
         
         
         
         
         
         
        