Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సుడిగాలి పర్యటన

– ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆకస్మిక తనిఖీ

– అధికారులకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు

విశ్వం వాయిస్ న్యూస్, చింతూరు డివిజన్
  • చింతూరు డివిజన్లో గోదావరి వరద పెరుగుతున్న సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి కూనవరం మరియు విఆర్ పురం మండలంలోని వివిధ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సందర్శించడం జరిగినది. మొదట పీఓ కుటూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి అక్కడ ప్రస్తుతం ఉన్న మందులు వరుస క్రమంలో స్వయంగా చెక్ చేయటం జరిగినది. అదేవిధంగా ఈ సంవత్సరం గోదావరి శబరి వరదలుకు డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంచాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో పుల్లయ్యని ఆదేశించారు. రేగులపాడు, అభిచర్ల, లింగాపురం, కూటురూ, పేదర్కూరు మరియు చినర్కూరు, కొండరాజుపేట పంచాయితీల జనాభాకు వరద సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని మరియు అదే విధంగా పీహెచ్సీ కుటూరుకు జెనరేటర్ ను త్వరలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అని చెప్పినారు. కుటూరు పీహెచ్సీ ఇంటెర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా అత్యవసర సమయంలో సమాచారం చేరవేయడానికి ఉపయోగపడుతుందని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు పేర్కొన్నారు. పిహెచ్సి పరిసరాలను గమనించిన ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు ఆసుపత్రి ఆవరణంలో పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని సదరు విలేజ్ రెవెన్యూ అధికారి వారిని ఆదేశించడం జరిగినది. కుటూరు గ్రామంలో ఉన్న జిసిసి గోడౌన్ లో ముందస్తుగా బియ్యం స్టాక్ ఉంచి 5 పంచాయతీలకు వరద సమయంలో పంపిణీ చేయటం కోసం ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల వారిని ఆదేశించడం అయినది. తదుపరి చినర్కూరు గ్రామం నందు ఉన్న ఒపెన్ ఏరియాలో ఉన్న ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ను సందర్శించడం జరిగినది అక్కడ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ వారు అడిగిన అదనపు బోర్స్, సోలార్ లైట్లు, బియ్యం అడ్వాన్స్ స్టాక్ మరియు రోడ్లు వంటి వాటి గురించి చర్చించడం జరిగినది. తరువాత వెలుగు గోడౌన్ కోతులగుట్ట లో సందర్శించి అడ్వాన్స్ స్టాక్ పెట్టాలని పౌర సరఫరాల వారిని ఆదేశించడం జరిగినది. కోతులగుట్ట నందు ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు సందర్శించి ఫ్లడ్ సమయంలో కావలసిన సదుపాయాలు గురించి ఆసుపత్రి సూపరిండెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ కొరత ఉన్నదని సూపరిండెంట్ వారు చెప్పగా అడ్డతీగల మరియు చింతూరు నుండి ఇద్దరు డాక్టర్లను నియమించడం జరుగుతుందని చెప్పినారు.పైడి గూడెం నందు రిజర్వ్ ఫారెస్ట్ ఒపెన్ ఫీల్డ్ ఏరియాలో ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ పరిశీలించడం జరిగినది. ఈ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ నందు ఒక 800 నుండి 1000 కుటుంబాలు నివాసం ఉండవచ్చు అని, ఇక్కడ ఒకటి లేదా రెండు హ్యాండ్ బోర్స్ అవసరం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ చెప్పారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల అనుమతితో బోర్స్ ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పారు. తహసీల్దార్, కూనవరం మండలం కార్యాలయంలో కంట్రీ బోట్స్ ఓనర్స్ తో ప్రాజెక్టు అధికారి సమావేశం అయి వారు వరద సమయంలో సమర్ధవంతంగా పని చేయటానికి వారికి కావలిసిన సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విఆర్ పురం మండలంలోని రేఖపల్లి పిహెచ్సి ను సందర్శించి స్టాకు తనిఖీ చేయటం జరిగినది. రేఖపల్లి లో ఏర్పాటు చేసుకున్న ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ను పరిశీలించి త్వరలో బరకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అక్కడే ఉన్న ఎంపిఎఫ్సి గోడౌన్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా జిఐ షీట్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి అన్నవరం బ్రిడ్జి నందు ఈ సంవత్సరం బ్రిడ్జి కి ఇరు వైపుల రాడ్స్ తో పెద్ద పెద్ద రోప్స్ ఏర్పాటు చేస్తాము అని ఇది ఏర్పాటు చేయటం వలన వర్షపు నీరు బ్రిడ్జి మీద పారుతున్నపుడు జనం బ్రిడ్జి దాటటానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద మట్టపల్లి గ్రామం లో ఉన్న వైద్య ఉప కేంద్రం లో వరద ల సమయంలో తగినంత మందులు మరియు ఒక డాక్టర్ ను ఉంచాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. ఈ ఉపకేంద్రంకు ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు ఒక ఫ్రిడ్జ్ ను మంజూరు చేశారు. అదేవిధంగా కన్నాయిగూడం టూ చింతరేగులపల్లి మరియు తుస్టివారిగూడెం టు ఏవి గూడెం రోడ్ బ్లాక్ పాయింట్స్ స్వయంగా చూసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పెట్టించడం జరిగినది. అలాగే వరదకు సంబంధించిన సమాచారం ఈ సంవత్సరం నుండి మీడియా మరియు ఇతర వాట్సప్ గ్రూపులో అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు బాలకృష్ణరెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎటపాక , మురళి ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ , చింతూరు , శ్రీనివాస్ తహశీల్దార్ , కూనవరం , సరస్వతి , తహసిల్దార్, విఆర్ పురం , జగన్నాథం ఎంపీడీవో , కూనవరం , ఇమ్మాన్యూలు ఎంపీడీవో , విఆర్ పురం , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo