తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో వరిలో ఆరుతడి పద్ధతి గురించి, ఉపయోగం గురించి రైతులతో ట్రైనింగ్ నిర్వహించారు. ఈ ట్రైనింగ్ లో జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ వలి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధి విధానాలు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు గురించి చెప్పారు. అలాగే వరి పొలంలో ఆరుతడి అనేది చాలా మంచిదని దానివల్ల రైతుకు మంచి జరుగుతుందని అదేవిధంగా నీటి ఆదా విద్యుత్ శక్తి ఆదా పురుగులు తెగులు తక్కువ ఆశించుతాయి మంచి పంటను తీయొచ్చు అని అన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వేణు మాట్లాడుతూ ప్రతి రైతు తనకు ఉన్న పొలంలో కొంత అయినా ప్రకృతి వ్యవసాయం చేయాలని పొలంలో కాశయాలు వాడితే మంచిదని చెప్పారు అలాగే ఈ ఆరుతడి విధానం అనేది అందరూ పాటించే పద్ధతి దీని వల్ల రైతులకు ఎటువంటి నష్టం లేదని అందరూ ఈ విధానాన్ని పాటించాలని చెప్పారు అదేవిధంగా రైతులందరిని పొలంలోకి తీసుకువెళ్లి ఏడబ్ల్యుడికి సంబంధించిన పైపును పొలంలో ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేసి రైతులకు దాని యొక్క ఉపయోగం గురించి జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి వివరించడం జరిగింది. తర్వాత బయోచార ప్రిపరేషన్ గురించి దాని తయారీ విధానాన్ని ఉపయోగాలను పొలానికి ఏ విధంగా ఉపయోగించాలి అని పూర్తిగా వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి లు శ్రీనివాస్, పొలవేణి,రత్నకుమారి మరియు రైతులు పాల్గొనడం జరిగింది

