జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన గోనెడ గ్రామంలోని సూర్యారావుపేటలో 11 కేవీ విద్యుత్ స్తంభం ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూస్థిరత్వం కోల్పోయి వంగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఈ వీధిలో ప్రతి రోజు అనేక మంది చిన్నపిల్లలు, వృద్ధులు,రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ స్తంభం ఎప్పుడైనా పూర్తిగా నేలకొరిగే ప్రమాదం ఉందని, అది జరిగితే ప్రాణ నష్టం కలిగే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సంబంధిత విషయం సమాచారం ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ స్పందించి స్తంభాన్ని మరమ్మతు చేయాలని లేదా కొత్తదాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.ప్రమాదాన్ని ముందే నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూర్యరావుపేట వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు