వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ : అడబాల ట్రస్ట్
అడబాల ట్రస్టు కార్యాలయంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ తన పుట్టినరోజు ను పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మదినోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకునే స్థోమత ఉన్నా కూడా పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవాలనే తలంపుతో తన పుట్టినరోజును జరుపుకుంటున్న డాక్టర్ అడ్డాల సత్యనారాయణ సేవా తత్పరత అభినందనీయమన్నారు. వారి పూర్వికులు నుండి కుటుంబమంతా సేవా తత్పరతతో కొనసాగడం అభినందనీయమన్నారు .ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ శిరీష, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జీ. కృష్ణమోహన్ లు డాక్టర్ అడ్డాల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కేకు కట్ చేశారు. అనంతరం అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ- జానకిరామ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్. శ్రీ నగేష్ , బుద్ధరాజు సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.