14 October 2025
Tuesday, October 14, 2025

వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు 30, 000 రూ అందించాలి – ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం డిమాండ్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవన భద్రత, జీవనోపాధి కల్పించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణం లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగానంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ పథకాలు తో కూడిన ఆటో సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధిక పెనాల్టీలను వేసే జీవో నంబర్ 21 ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 30 వేల రూపాయలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు విధానంతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాహన మిత్ర ద్వారా కేవలం సంవత్సరానికి 15 వేల రూపాయలు ప్రకటించడం అన్నారు. నేటి సమాజంలో సామాన్య కుటుంబం జీవనానికి కనీసం 20 వేలకు పైబడి అవసరం ఉంటుందని ఆటో డ్రైవర్ ఆటో ఫైనాన్స్ కడుతూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలంటే సంవత్సరానికి 15 వేల రూపాయలతో ఎలా జీవించగలరు అన్నారు. కనీసం సంవత్సరానికి 30 వేల రూపాయలు వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు అందించాలని డిమాండ్ చేశారు.ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు నాయకులు పి నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో నిర్వహించిన సభలో ఆటో కార్మికులందరికి దసరా పండుగ రోజున వాహన మిత్ర 15 వేల రూపాయిలు అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్త్రీ శక్తీ ప్రీ బస్సు వలన 80 శాతానికి పైగా ఆదాయం కోల్పోయిన ఆటో, టాటా మ్యాజిక్ వంటి డ్రైవర్లకు వాహన మిత్ర సహాయం పెంచాలన్న ఆటో మోటారు కార్మిక సంఘాల అభ్యర్ధనను చంద్రబాబు పట్టించుకోలేదు అని ఆవేదన చెందారు. పైగా ఐదు ప్రధాన హామీలలో ఒకదానిని ప్రకటిస్తూ మిగిలిన హామీలను విస్మరించడం చంద్రబాబు గారి అతి తెలివికి నిదర్శనం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రవేట్ ఎలక్ట్రికల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రొంగల హరీష్ తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo