విజ్ఞాన్ లో విద్యాబోధన తో విద్యార్థుల మనసుల్లో సుస్థిర స్థానం
ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు
అభినందనలు తెలిపిన విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్, అడ్వైజర్
విద్యార్ధులకు ఉత్తమ బోధనలు చేసి వారి మనసులో సుస్థిర స్థానం సంపాందించిడం మధురమైన జ్ఞాపకం అని విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేషవేణి పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలోని విజ్ఞాన్ విద్యా సంస్థలలో విద్యా బోధన చేయడమే కాక, తన ప్రవర్తన, వినయం తో విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచిన సత్తి తేజా సుస్మిత రెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం మరొక ప్రాంతానికి తరలివెళ్తున్న సందర్భంగా శనివారం ఆమెకు విద్యాసంస్థల తరపున ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్ విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మల్లిడి అమ్మి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ నీట్ లో ఉత్తమ ర్యాంక్ సాధించి బి.హెచ్.ఎమ్.ఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులో సీటు సంపాదించడం అభినందించదగ్గ విషయమని, విద్యా సంస్థలను సుస్మిత రెడ్డి వదిలి వెళ్ళడం కాస్త బాధ కలిగించే విషయమే అయినప్పటికీ, త్వరలో తాను డాక్టర్ గా మధ్య కు వస్తారని, ఆమె లాగే ప్రతి విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేష వేణి మాట్లాడుతూ ఉత్తమమైన భోధనతో విసుగు లేకుండా సేవలందించి, విద్యార్థులతో ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న సుస్మిత రెడ్డి మరిన్ని ఉన్నత లక్ష్యాలను అందుకునేలా ప్రయత్నించాలని ఆకాంక్షించారు. విద్యార్థులంతా కష్టపడి, ఆసక్తితో చదవాలని, సాంకేతికత తమ అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆమె వివరించారు. విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపాల్ అచ్చిరెడ్డి, విజ్ఞాన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్. త్రివేణి లు నీట్ లో సీటు పొంది, ఉన్నత చదువుల నిమిత్తం వెళ్తున్న సుస్మితను అభినందిస్తూ,ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇంతకాలం ప్రేమాభిమానాలు చూపిన తోటి వారిని విడిచి మరొక ప్రాంతానికి వెళ్లడంపై సుస్మిత రెడ్డి బావోద్వేగం చెందారు.
ఈ కార్యక్రమానికి సుస్మిత తల్లిదండ్రులు సత్తి చంద్రశేఖర్ రెడ్డి,కాంతికళ లు హాజరవ్వగా, వి.ఎస్.ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సతీష్ రెడ్డి,విజ్ఞాన్ అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు సుస్మితా రెడ్డి కి అభినందనలు తెలిపారు.

