విద్యానిధి స్కూల్లో ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలు
ఇన్కమ్ టాక్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆదాయపు పన్ను శాఖ అధికారి జనిపల్లి ఓం కృష్ణ ఇతర ఆఫీసర్లు ఆదాయపు పన్ను అభివృద్ధి కి తోడ్పడే విషయాల మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని విద్యానిధి స్కూల్లో ఘనంగా నిర్వహించారు. సంపాదన ఉన్న ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను కట్టడం వలన దేశ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించవచ్చు మరియు ప్రతి పౌరుని యొక్క హక్కు అని ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ జనిపల్లి ఓం కృష్ణ విద్యార్థులకు అవగాహన కల్పించి, క్విజ్ నిర్వహించారు. స్కూల్ ఆవరణలో వేప మొక్కను నాటడం జరిగింది, ప్రతి విద్యార్ధి మొక్కలు నాటడం ఒక అలవాటుగా మార్చుకోవాలని ఐ టి ఓ అధికారి ఓం కృష్ణ సూసించారు విద్య కి ఉపయోగపడే బహుమతిని మేనేజ్మెంట్ కి అందచేశారు.
విద్యానిధి సంస్ధ అధినేత ఎ.బి. నాయుడు , కరెస్పాండెంట్ శ్యామల మహాలక్ష్మి , ప్రిన్సిపల్ టి.నాగమాధవి నేతృత్వంలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు.