ఎంపీఎస్ లో క్యాబినేట్ ఎన్నికలు…
మండపేట పబ్లిక్ స్కూల్ లో క్యాబినెట్ ఎన్నికలు జరిగాయి.ప్రజాస్వామ్య దేశం లో ఎన్నికలు జరిగే విధానంపై విద్యార్థి దశ నుండే అవగాహన కల్పిస్తున్న ఎంపీఎస్ యాజమాన్యం అభినందనీయులని మండపేట మండల విద్యా శాఖాధికారులు నాయుడు రామచంద్రరావు, చింతా వెంకట సోమిరెడ్డి లు అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తరహాలో స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల్లో విజేతలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు మాట్లాడుతూ ఎందరో మహా నాయకులు పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారన్నారు.ప్రజాస్వామ్యం పట్ల ప్రస్తుత యువతకు నమ్మకం తగ్గుతున్న తరుణంలో విద్యార్ధి దశలోనే భారతదేశ వజ్రాయుధమైన ఎన్నికల ప్రక్రియను అలవర్చాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉందన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే విద్యావ్యవస్థలో విద్యార్ధి నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు మండపేట పబ్లిక్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రతీ ఏడాది కేబినెట్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విధానం పై పూర్తి స్థాయి అవగాహన కలిగే విధంగా నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ విత్ డ్రా, స్క్రూటినీ, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన, అనంతరం జరిగే ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన తదితర అన్ని విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారు. ఇలాంటి ఎన్నికల వల్ల విద్యార్ధుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెరుగుతాయని ఉత్తమపౌరులుగా రూపుదిద్దుకోవడానికి ఉపకరిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన హెడ్ బాయ్ వల్లూరి అర్జున్ నంద, హెడ్ గర్ల్ టేకి బిందు లక్ష్మి , డిప్యూటీ హెడ్ బాయ్ అగర్తి మాధవ్, డిప్యూటీ హెడ్ గర్ల్ గుణ్ణం నేహా శాన్వి చౌదరి, హౌస్ కెప్టెన్స్ కొప్పిశెట్టి హర్షిత్, కొర్లపాటి శ్రీ మోక్షిత, గోవిందరాజుల శిశిర, మగ్గం రేవంత్ శ్రీ సాయి తేజ, హౌస్ వైస్ కెప్టెన్స్ మాసాబత్తుల అభిలాష్, ఖండవల్లి హర్ష సత్య జనార్ధన్, ఎలి ప్రేమ్ జోయల్, వాసంశెట్టి అమూల్యలకు బ్యాడ్జీలు,ఫ్లాప్స్ ను అందజేసి వారిచేత ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.