భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల పోటీలు
విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం సంస్కృత కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జి వి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు సంయుక్తంగా కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించాలనే సంకల్పంతో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి దేశం పట్ల భక్తి గౌరవాలను పెంచుకునే విధంగా ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు మండల స్థాయిగా జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని జిల్లా స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి రీజనల్ స్థాయి మరియు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కొవ్వూరు పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 160 మంది విద్యార్థులు దేశభక్తి గీతాలు పోటీలలో పాల్గొనడం సంతోష్ దాయకమన్నారు.