విద్యార్థి 3 రోజుల గైర్హాజరు – తల్లిదండ్రులకు తక్షణ ఫోన్ కాల్
5 రోజుల గైర్హాజరు – MEO/CRPల ద్వారా ఇంటి సందర్శన
టీచర్లు సెలవు తీసుకుంటే – వెంటనే ప్రత్యామ్నాయ బోధన ఏర్పాటు
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక నిఘా కొనసాగించాల్సిందిగా సూచన
విద్యార్థుల హాజరుపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల హాజరుపై దృష్టి సారించింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, విద్యార్థులు మూడు రోజులకు మించి బడికి రాకపోతే, వారి తల్లిదండ్రులకు వెంటనే ఫోన్ చేయాలని టీచర్లకు ఆదేశించింది.
ఇంతకే ఆగకుండా, ఐదు రోజుల కంటే ఎక్కువ గైర్హాజరు ఉంటే, సంబంధిత మండల విద్యాధికారి (MEO) మరియు క్లస్టర్ రెసోర్స్ పర్సన్ (CRP) లు అయే విద్యార్థి ఇంటికి వెళ్లి కారణాలు తెలుసుకోవాలని సూచించింది. విద్యార్థుల గైర్హాజరును ఖచ్చితంగా గమనిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీచర్లు హాజరు, సెలవులపై స్పష్టత
అలాగే, టీచర్ల హాజరుపైనా విద్యాశాఖ దృష్టి సారించింది. టీచర్లు సెలవు పెడితే, వెంటనే ప్రత్యామ్నాయ బోధన ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. అకడమిక్ మానిటరింగ్ అధికారులు (Academic Monitoring Officers) తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
ముఖ్యాంశాలు:
-
విద్యార్థి 3 రోజుల గైర్హాజరు – తల్లిదండ్రులకు తక్షణ ఫోన్ కాల్
-
5 రోజుల గైర్హాజరు – MEO/CRPల ద్వారా ఇంటి సందర్శన
-
టీచర్లు సెలవు తీసుకుంటే – వెంటనే ప్రత్యామ్నాయ బోధన ఏర్పాటు
-
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక నిఘా కొనసాగించాల్సిందిగా సూచన
ఈ చర్యల ద్వారా విద్యార్థుల తరచూ గైర్హాజరు సమస్యను తగ్గించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల విద్యాభ్యాసాన్ని నిరవధికంగా కొనసాగించే ఉద్దేశంతోనే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది.

