విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం
కరప మండలం నడకుదురు గ్రామం మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాల, నడాకుదురు నెంబరు1 కరప మండలం నందు విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా గల పంట పొలంకు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ తీసుకుని వెళ్లి విద్యార్థులచే వరి నాట్లు, నాటుటపంటలు పెంచుట గురించి అవగాహన కల్పించారు, విద్యార్థులు ఏరువాక సాగు గురించి తెలుసుకున్నారు. స్థానికంగా గల రైతులతో విద్యార్థులు ముచ్చటించారు. పంట ఎదుగుదల,కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందుల పిచికారి, గురించి తెలుసుకున్నారు.పంటను చేతికి వచ్చేవరకు అన్నదాత 180 రోజులు పాటు ఎంతో శ్రమ పడతారని తెలుసుకున్నారు.మొదలగు విషయాలు అన్ని రైతులను అడిగి తెలుసుకుని విద్యార్థులు,పంటలు సాగు గూర్చి పూర్తి అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ మాట్లాడుతూ తమ పిల్లలకు తరగతి గదులు పాఠశాలల్లోనే చదువు కాకుండా పరిశీలించడం, స్వయ అనుభవం ద్వారా వారికి గుర్తుకుంటుందని మంచి అవగాహపొందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కె. మేరీ రత్నకుమారి, ఉపాధ్యాయులు బుంగ రాంబాబు, కె విజయలక్ష్మి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.