14 October 2025
Tuesday, October 14, 2025

విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు

విద్యుత్ భారాలు, ట్రూ అప్ చార్జీలు,పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని, వీటికి వ్యతిరేకం గా ప్రజలు ఉద్యమం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబు పిలుపునిచ్చారు. కాజులూరు మండలం, శీల్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలతో కలిసి విద్యుత్ బారాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టట్టారు. స్మార్ట్ మీటర్లు రద్దు, సెకి ఒప్పందం రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేయబోయే మరో చార్జీలు భారాలు కు వ్యతిరేకంగా ఆగష్టు 28 ప్రతిజ్ఞ దినం పాటింంచినట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ వద్దు అంటే మీ ఇంటికి బిగించరు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే మరొకప్రక్క స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం కొనసాగిస్తుందని వారు విమర్శించారు. 2000 సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్ లో జరిపిన దమనకాండలో మరణించిన సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి మరణం, వారి త్యాగం గుర్తు చేసుకుని విద్యుత్ భారాలకు వ్యతిరేకం గా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతుల మహాలక్ష్మి, బుడితి ప్రభాకరరావు, మోకన సత్యనారాయణ, పోతుల వెంకటరమణ, చీకిరిమిల్లి సత్యనారాయణ, పోతుల లక్ష్మీదుర్గ, చెల్లి మావుల్లమ్మ, మోకన మంగ తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo