జనసేన నాయకులు, జన సైనికులు తో విశాఖపట్నం లో గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మండపేట నియోజకవర్గ జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ హాజరయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జన సేన ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ చర్చించినట్లు చెప్పారు. నియోజకవర్గం నుండి క్రియాశీలక జన సైనికులు అక్కడికి వెళ్లారు.

