తాజాగా కోలీవుడ్‌లో జరుగుతున్న పెద్ద చర్చకు హీరోయిన్ నయనతార సమాధానం ఇచ్చింది. తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో విడిపోతున్నారనే వార్తలపై నయనతార సోషల్ మీడియాలో క్లియర్ కౌంటర్ ఇచ్చారు. పుకార్లను ఖండిస్తూ విఘ్నేశ్‌తో క్యూట్ ఫొటో షేర్ చేస్తూ, ‘‘మా మీద వచ్చే సిల్లీ న్యూస్‌లను చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే’’ అంటూ సరదా కామెంట్ పెట్టారు.
కొద్ది రోజులుగా నయనతార తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక భావోద్వేగ పోస్టు కారణంగా విడాకుల వదంతులు మొదలయ్యాయి. ఆ పోస్టులో ‘‘తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పు. భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత ఎందుకు తీసుకోవాలి?’’ అని అర్థమయ్యేలా వాఖ్యలు ఉండటంతో కోలీవుడ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.
ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే తొలగించినప్పటికీ, అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యి, నయనతార–విఘ్నేశ్ జంట విభేదాలు పడిందనే గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటిపై నయనతార మౌనంగా ఉండకుండా, తాజాగా భర్తతో కలిసి తీసుకున్న ఫొటోను పోస్టు చేసి, అందులో ఉన్న ప్రేమను చూపిస్తూ అన్ని పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
నయనతార తరచూ తన వ్యక్తిగత విషయాలను మీడియా దృష్టికి తేవడం తక్కువే చేస్తారు. కానీ ఈసారి వచ్చిన వదంతులు హద్దులు దాటుతుండడంతో, సున్నితంగా అయినా బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లే చేశారు. అభిమానులు మాత్రం ఈ పోస్టును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా లవ్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది’’ అని నయనతార ఇన్‌డైరెక్ట్‌గా చెప్పినట్లు ఫ్యాన్స్‌కి అర్థమవుతోంది.
నయనతార–విఘ్నేశ్ శివన్ జంటకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ ఇమేజ్ ఉంది. ఇలా పుకార్లను తిప్పికొట్టిన తీరుతో వాళ్లకు అభిమానుల అభిమానం మరింత పెరిగినట్లే చెప్పాలి.