01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఉత్సవ మండపాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలి

నిమజ్జన కార్యక్రమ వివరాలు ముందుగానే పోలీస్ వారికి తెలపాలి

ఇతర మత మందిరాల కు దూరంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి

డీజేలు, బాణసంచా, అశ్లీల నృత్యాలు నిర్వహించరాదు

మండపేట రూరల్ సీఐ పి దొర రాజు

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండపేట రూరల్ సీఐ పి దొర రాజు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో  ఆదివారం స్థానిక ఎస్సై డి సురేష్ బాబు అధ్యక్షతన, మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు పొందిన మండప కమిటీలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత రాయవరం ఎస్సై సురేష్ బాబు మాట్లాడుతూ  మండపాల నిర్వహణకు అనుమతులు పొందిన 57 కమిటీల వారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, క్యూఆర్ కోడ్ లను లామినేషన్ చేసి అందుబాటులో ఉంచుకోవాలన్నారు, మండపం వద్ద విలువైన వస్తువులు, వెండి, బంగారు వస్తువులను ఉంచవద్దని, ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రతిరోజు మండపం వద్ద హుండీల కు కాపలాగా ఇద్దరు వ్యక్తులు పహారా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారుల పై వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగించకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, మండపాల వద్ద, నిమజ్జనం కార్యక్రమ, ఊరేగింపు సమయంలో బాణాసంచా ను ఉపయోగించ రాదని, నిమజ్జనానికి ఒక రోజు ముందుగానే పోలీస్ స్టేషన్ లో  తెలియపరిచి అనుమతులు పొందాలని, అసాంఘిక కార్యకలాపాల జోలికి పోకుండా వ్రతం ఆచరించినట్లు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, చిన్నపిల్లలు, అధికంగా మద్యం సేవించిన వారు నిమజ్జన కార్యక్రమాలకు దూరంగా ఉండేలా చూడాలని కమిటీలకు సూచించారు. అనంతరం మండపేట రూరల్ సిఐ పి దొర రాజు మాట్లాడుతూ వినాయక ఉత్సవాల నిర్వహణకు బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు మధ్యలో తొలగిపోక, పూర్తి బాధ్యతలు వహించాలని 5 అడుగుల పరిమితికి మించిన విగ్రహాలను పెట్టొద్దని, సాధ్యమైతే మట్టి విగ్రహాలను ఉపయోగిస్తూ, పర్యావరణహితం గా ఉండేలా చూడాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండే వారే మండపంలో వద్ద బాధ్యతలు వహించే లా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇతర మతాలకు సంబంధించిన దేవాలయాల వద్ద మండపాలు ఏర్పాటు చేసి కించపరిచే వ్యాఖ్యల ద్వారా మతసామరస్యం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలలో ప్రాముఖ్యమైన మండపం లోని లడ్డు వంటి పవిత్రమైన వస్తువులకు రక్షణ కల్పించేలా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపం నిమిత్తం ఏర్పాటు చేసే విద్యుత్తును డైరెక్ట్ గా తీగల నుండి కాక, దగ్గరలోని దేవాలయాలు లేదా సమీపంలోని గృహాల వద్ద నుండి అనుమతి పొంది విద్యుత్తును తీసుకోవాలని వివరించారు, దీపాలు, మండే గుణం కలిగిన వస్తువులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్ని ప్రమాదాలను అదుపు చేసేందుకు నీరు, ఇసుక బస్తాలు, చిన్నపాటి అగ్నిమాపక యంత్రాలు వంటివి ముందుగానే చూసుకోవాలని సూచించారు, ప్రైవేట్ స్థలాలలో మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా స్థల యజమాను ల వద్దనుండి అనుమతి పొందాలని, దేవాలయాలలో కాక విడిగా మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా రామచంద్రపురం డిఎస్పీ కార్యాలయం నుండి సౌండ్ పర్మిషన్ పొందాలని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే  పాటలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి మోనో స్పీకర్స్ ద్వారా నిర్వహించాలని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమం జరిగించడాని కి ఒకరోజు ముందుగా రూట్ మ్యాప్, ఏర్పాట్ల గూర్చి స్థానిక పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తద్వారా పోలీస్,రెవిన్యూ, పంచాయితీ వారి ద్వారా ఊరేగింపుకు అవసరమైన ఏర్పాట్లు అందుతాయని ట్రాఫిక్ అంతరాయం లేకుండా మండపం నుండి నిర్ణిత నిమజ్జన ప్రాంతం వరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తూ, ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని, డిజే కు ఎటువంటి పర్మిషన్ లేదని కనుక ఎవరు పెట్టొద్దని వివరించారు, కోయ డాన్సులు, హిజ్రాల వేషధారణలు వంటివి కాక సాంస్కృతిక వేషధారణలతో నిమజ్జన కార్యక్రమాన్ని మర్యాదగా సాగినవ్వాలని, అశ్లీల నృత్యాలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి స్వామివారికి అపకీర్తిని తేవద్దని హెచ్చరించారు. కార్యక్రమాలు పూర్తయి క్షేమంగా ఇంటికి చేరేంతవరకు బాధ్యతలను కమిటీలు స్వీకరించాలని, మండలంలో వినాయక చవితి ఉత్సవాలు,పోలీసులకు సహకరిస్తూ ప్రశాంతంగా జరిగేలా అన్ని విధాలుగా బాధ్యతలు వహిస్తూ ముందుండి నడిపించాలని మండపేట రూరల్ సిఐ దొర రాజు కమిటీలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్సై రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు, మండలంలోని వినాయకచవితి ఉత్సవ కమిటీ లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo