21 October 2025
Tuesday, October 21, 2025

వినాయక మండపాలు ఏర్పాటు కు అనుమతులు తప్పనిసరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ సూచన

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
  • వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా, మండపాలు, పందిళ్ళు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని రామచంద్రపురం డి ఎస్పి రఘువీర్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానా లు చెల్లించనవసరం లేదని ఆయన తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా అనుమతులు పొందవచ్చునని తెలియచేస్తూ నమోదు విధానాన్ని వివరించారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం ద్వారా https://ganeshutsav.net  క్లిక్ చేసి అనుమతులు పొందాలన్నారు. ఈ విధానం ద్వారా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమర్జనం లకు అనుమతులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.
    దరఖాస్తు చేయు విధానం
    తొలుత Ganeshutsav.net వెబ్సైటులోకి వెళ్లి న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఒటిపి ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది.
    దరఖాస్తు ఫారంలో నమోదు చేయాల్సిన వివరాలు
    దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా. అసోసియేషన్/కమిటీ పేరు. గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తులను తెలిపి, ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో పొందు పరచాలి. ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. గణేష్ నిమర్జనం తేది, సమయం, వాహన వివరాలను వివరించి, దరఖాస్తు సమర్పణ అనంతరం సంబంధిత పోలీసులు ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులను మంజూరు చేస్తారని వివరించారు.
    నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ డౌన్లోడ్  చేయు విధానం
    కమిటీ సభ్యుల వివరాలను https://ganeshutsav.net/applicationStatus సైట్ లోకి వెళ్లి మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే,  నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్.వో.సి) ను, పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రింట్ తీసి, ల్యామినేషన్ చేసి మండపంలో ఉంచడం ద్వారా తనిఖీకి వచ్చే అధికారులు వీటిని పరిశీలిస్తారని తెలిపారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ ప్రజలను కోరారు.
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo