Monday, August 4, 2025
Monday, August 4, 2025

వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్లు రాజబాబు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్లు రాజబాబు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు

కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు లో ఉన్న స్కీం వర్కర్లందరూ ఆశ వర్కర్స్ ఉపాధి కూలీలు మరియు కౌలు రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కాజులూరు అల్లూరు సీతారామరాజు బొమ్మవద్ద నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు .ఎంపీడీవో ఆఫీస్ వద్ద సంఘాల నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈదేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కార్పొరేట్లకు దారధత్వం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుందన్నారు.దీనిలో భాగంగానే గతంలో ఎన్నో లాభాలు ఉన్నటువంటి సంస్థలు కారు చౌకగాఅమ్మేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి సిద్ధమైందన్నారు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక తక్కువ జీతానికి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని మరో పక్కన 170 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశాన్ని అప్పుల్లో ముంచారని చిన్న చిన్న స్కీమ్ వర్కర్లు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, పెరిగిన ధరలు పెరిగిన పని భారం స్కీంవర్కర్లు ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదని ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలని కోరారు.అనంతరం కాజులూరు ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ దుర్గాదేవి జి లోవకుమారి ఎస్ అమ్మాజీ ఎస్ సూర్య కుమారి బీర సత్యా అనంతలక్ష్మి భక్తుల శేషరత్నం పంపన సీతారామరాజు దంగేటిశ్రీను పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo