పాఠశాల, హాస్టల్ లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలి
విద్యార్థులకు త్రాగునీరు, టాయిలెట్ అవసరాలపై అవగాహన కల్పించాలి
తప్పనిసరిగా లేబర్ మూమెంట్ రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలి
హెల్త్ అసిస్టెంట్ లకు మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచనలు
హెల్త్ అసిస్టెంట్స్ అందరూ తమ పరిధిలో గల హాస్టల్స్ ను సందర్శించి ఆ పరిస్ధితులను విజిటర్ బుక్స్ లో నమోదు చేయాలని మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట యూనిట్ పరిధిలో గల గొల్లపుంత అర్బన్ హెల్త్ సెంటర్ నందు సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ ఆధ్వర్యంలో శనివారం హెల్త్ అసిస్టెంట్స్ కు ఎన్.వి.బి.డి.సి.పి యాక్టివిటీస్ గూర్చి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వలన లార్వా ప్రభలే అవకాశం ఉన్నందున, ప్రతి హెల్త్ అసిస్టెంట్ హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఇన్ అండ్ అరౌండ్ పరిశీలించి లార్వాను కనుగొని నిర్మూలన చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్స్ తమ పరిధిలో గల హాస్టల్స్ ను సందర్శించి హాస్టల్ గదుల కిటికీలకు దోమల మెస్ లు ఉన్నవి,లేనివి గుర్తించి ఆ వివరాలను విజిటర్ బుక్స్ లో వ్రాయాలని సూచించారు. డైనింగ్ హాల్, వాష్ రూమ్స్, బాత్రూమ్స్ శుభ్రంగా ఉన్నవా? లేవా? అనేది పరిశీలించి రూట్ చేయాలని వివరించారు. మంచినీరు సౌకర్యాలను పరిశీలించి త్రాగునీరు ఆర్వో వాటరా ? లేక ఎలాంటి త్రాగునీరు వారు త్రాగుచున్నారో విద్యార్థులకు తెలపాలన్నారు. అలాగే హెల్త్ అసిస్టెంట్ లు వారి పరిధిలో గల పాఠశాలలన్నిటిని సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సీజన్లో సాధారణ సరణములు మలేరియా, డెంగ్యూ జ్వరాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిని అప్రమత్తం చేయాలని వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మీద వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అధిక వర్షాలు కారణంగా నీరు కన్తాబరేటెడ్ అవ్వడంతో డయేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకునేలా నేర్పించాలన్నారు. వాటర్ హెడ్ ట్యాంక్ లను క్లోరినేషన్ చేయించాలని, వాటర్ క్లోరినేషన్ ట్యాంక్ క్లీనింగ్ ఎ ప్పుడెప్పుడు జరుగుతున్నది క్లోరినేషన్ రిజిస్టర్ పెట్టి అందులో నోట్ చేయించాలని సూచించారు. గడిచినా 15 రోజుల క్రితం జ్వరము వచ్చిన వారికి సైతం బ్లడ్ స్మియర్ తీసి ల్యాబ్ కు పంపించాలపని సూచించారు. హెల్త్ అసిస్టెంట్ లు అందరూ ఇన్ టైంలో రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని హెచ్చరించారు. అనంతరం సబ్ యూనిట్ ఆఫీసర్ హెల్త్ అసిస్టెంట్ రికార్డ్స్ ను పరిశీలించి, తగు సూచనలు చేశారు. లేబర్ మూమెంట్ రిజిస్టర్ అనగా ఇతర ప్రాంతంలో నుండి బట్టీ లలో పని చేయుటకు వచ్చిన వారి యొక్క వివరములు పూర్తిగా తెలుసుకుని రిజిస్టర్ మెయింటైన్ చేయాలని సూచించారు.
అదేవిధంగా స్కూల్ హెల్త్ స్కూల్ స్టాప్ పర్టికులర్స్ వివరాలకు పూర్తిగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలని వివరించారు. ప్రత్యేకంగా డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా హెల్త్ అసిస్టెంట్స్ అంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మండపేట యూనిట్ పరిధిలో గల హెల్త్ అసిస్టెంట్లు హాజరయ్యారు.

