విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రీన్ డే వేడుకలు
ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజ్ఞాన విద్యాసంస్థల డైరెక్టర్,చైర్మన్
విద్యార్థులకు చిన్నతనం నుంచే ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో, మండల కేంద్రమైన రాయవరంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో “గ్రీన్ డే” వేడుకలను, శనివారం స్కూల్ ప్రిన్సిపాల్ త్రివేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రత్యేకంగా ఆకుపచ్చ దుస్తులు ధరించి, పచ్చని ఆహారం తీసుకున్నారు, పచ్చదనం ప్రాధాన్యత పై నాటికలు, పాటలు, చిత్ర ప్రదర్శనలు చేస్తూ, పృకృతి పై పలు నినాదాలను విద్యార్థులతో పలికించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేష వేణి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేషవేణి మాట్లాడుతూ, పిల్లలకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు, ఈ గ్రీన్ డే కార్యక్రమం నిర్వహణ ఉపయోగపడుతుందని, భవిష్యత్ తరాలకు హరితభూమి ని అందించాలంటే విద్యార్థులకు ఇలాంటి బోధన అవసరమన్నారు, అనంతరం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి మాట్లాడుతూ, మానవ జీవన విధానంలో ప్రతి అవసరత నిమిత్తం, ప్రకృతిపై మనుషులు ఆధారపడి జీవిస్తున్నారని, నేటి బాలలే రేపటి పౌరులు కనుక, చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల అవగాహన పెంచుతూ, పచ్చదనం,పరిశుభ్రత వంటి అంశాలపై వారికి శ్రద్ద కలిగేలా నేర్పించడం ద్వారా, భవిష్యత్ లో ప్రకృతిని ప్రేమించే పౌరులుగా ఎదుగుతారని, ప్రకృతికి హాని చేయక, రక్షించాలనే విజ్ఞతను, చిన్నతనం నుంచి నేర్పిస్తూ పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడుతూ, తమ తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. మొక్కలలో జీవం ఉందని, అది మనకు నేస్తాలు అని పిల్లలకు నేర్పిస్తూ, వృక్ష ప్రతిమలో విద్యార్థులను నిలబెట్టి, వారితో మాట్లాడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

