రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ 2.0
ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ జి.యస్.ఎన్ రెడ్డి, ఉండవల్లి రాంబాబు..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ ను స్పెషల్ ఆఫీసర్ బి.ఈశ్వరి ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ ఎం రామారావు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్,ఉండవల్లి రాంబాబు చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యవ్వన ప్రాయంలో,ప్రప్రదమైన దశకు విద్యార్థులుగా చేరుకున్నారని, జీవితం పూలబాటగా సాగాలన్నా, ముల్లబాటగా మారాలన్నా,ఈ దశలో వేసే అడుగులు,తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమని సూచించారు, మందు, మత్తు పదార్థాలలో సంతోషం ఉందని యువత భ్రమ పడుతూ, దురలవాట్ల వైపు, మొగ్గు చూపుతున్నారని, దానివలన జీవితాలు పాడైపోతాయని వివరించారు, మంచి మార్గం లో ఉన్నత దశకు చేరేలా ప్రయత్నించాలన్నారు, విద్యార్థులు నడుస్తున్న తీరును గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు, అనంతరం గత ఇంటర్మీడియట్ పరిక్షా ఫలితాలలో మండలంలోనే ఉత్తమ ప్రతిభను కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను,వారి తల్లిదండ్రులను సన్మానించారు. అనంతరం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు,సంగీతంతో సహపంక్తి భోజనాలను చేసారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఐపీ శెట్టి, తెదేపా గ్రామ శాఖ అధ్యక్షులు కోట వెంకటరమణ, తెదేపా సీనియర్ నాయకులు వల్లూరి శ్రీనివాసరావు చౌదరి, జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు, బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు దొంతంశెట్టి బాల కేదారీశ్వరుడు, కె వెంకట సురేష్, ఎంపీటీసీ గంటి రోజా, రాయవరం మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ,కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు,తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

