మానవత్వం చాటిన నెల్లిపాక యువకుడు వినయ్
– వినయ్ ను అభినందించిన స్థానికులు , అధికారులు
గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన యాచకుని పట్ల మండల పరిధిలోని నెల్లిపాక గ్రామానికి చెందిన యువకుడు ముదిగొండ వినయ్ మానవత్వం చాటుకున్నారు. నెల్లిపాక గ్రామ సమీపంలో ప్రమాదానికి గురై జాతీయ రహదారి పక్కన పడి ఉన్న యాచకున్ని యువకుడు వినయ్ గుర్తించి ఫస్ట్ ఎయిడ్ చేసి , ఆకలితో ఉన్న తనకు భోజనం ఏర్పాటు చేశారు. చిరిగిన వస్త్రాలతో ఉన్న యాచకునికి వస్త్రాలు అందించగా స్థానికులు యువకుడు వినయ్ ను ప్రత్యేకంగా అభినందించారు. స్థానికంగా ఎవరికి ఏ ఆపద సంభవించినా , రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా , మరణించినా నేనున్నానంటూ తన వంతు సహకారం అందించడంలో వినయ్ గుర్తింపు పొందాడు. అధికారుల మన్ననలు సైతం పొందడం గమనార్హం.