డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొథా తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తూ,తీవ్ర ప్రభావం చూపనుందనే ఉన్నతాధికారుల హెచ్చరికల మేరకు, రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు ఆదేశాలతో రాయవరం మండల వ్యాప్తంగా 33 కె.వి లైన్ తీగలపై విరిగిపడే అవకాశం ఉన్న చెట్టు కొమ్మలు,తాటి, కొబ్బరి చెట్లను మంగళవారం ఉదయం నుండి అసిస్టెంట్ ఇంజనీర్ సందాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో లైన్ మేన్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో కలిసి యుద్థ ప్రాతిపదికన తొలగించారు.
ఈ సందర్భంగా ఎ.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ తుఫాను తీవ్రత అధికంగా ఉన్నందున ముఖ్యంగా సబ్ స్టేషన్ లకు విద్యుత్ సరఫరా జరిగే లైన్లను ముందుగా పరి రక్షించే ప్రయత్నం చేస్తున్నామని, తుఫాను తీవ్రత దృష్ట్యా పరిస్థితులు సవాలు తో కూడినవని అయినప్పటికీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

