Thursday, August 7, 2025
Thursday, August 7, 2025

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండలం

నేటి యువత మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు బానిస కావద్దని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్ననాటి నుంచి మంచి అలవాట్లతో పెరిగి ఆదర్శవంతమైన యువకులుగా సమాజంలో మెలగాలని మండపేట రూరల్ ఎస్ ఐ వి.కిషోర్ పేర్కొన్నారు.వెలగతోడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో డ్రగ్ అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వి. కిషోర్ మాట్లాడుతూ సమాజంలో విరివిగా దొరుకుతున్న మత్తు పదార్థాలు డ్రగ్స్ కి అలవాటు పడకుండా ఆరోగ్యాన్ని భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ఈ వయసు నుండే వాటి చెడు ఫలితాలను ప్రభావాలను తెలుసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శొంటేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని,నేటి సమాజం మంచి విద్యార్థులతోనే మొదలవుతుందన్నారు. నేటి నుండి పాఠశాలలో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేసి నిరంతరం విద్యార్థులను డ్రగ్స్ వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలతో సూచనలతో నిర్వహించి ముందుకు సాగాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ మంగాదేవి, వెలగతోడు మహిళా పోలీస్ మంగా, ఉపాధ్యాయులు వీరభద్రరావు, యేసు రాజు, వీర వెంకట్రావు, సహదేవుడు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo