ఈ వారం అన్న క్యాంటీన్ దాత స్వర్గీయ కంటిపూడి వెంకటరాయుడు సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కంచిపూడి సత్తిబాబుఆర్థిక సాయంతో
స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గండేపల్లి మండలం ఎన్ టి రాజాపురం గ్రామానికి చెందిన స్వర్గీయ కంటిపూడి వెంకటరాయుడు సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్తిబాబు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్తిబాబు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పో తుల మోహనరావు, కొత్తకొండ బాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, బొల్లం రెడ్డి రామకృష్ణ, సాని పిన్ని విశ్వేశ్వరరావు,(చినబాబు) కే తిన వెంకన్న చౌదరి (బాబి), యిప్పర్ల సురేష్, చాగంటి వెంకట గోపాలకృష్ణ, ఈ రవికుమార్, ఇంజరపు పెద్దకాపు, బెల్లపు సూరిబాబు, పైడిమల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.