దాత కీర్తిశేషులు పుర్రె బుచ్చన్న జ్ఞాపకార్థం పుర్రె బుచ్చన్న ట్రస్టుఆర్థిక సాయం
స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నఅన్నా క్యాంటీన్ కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు పుర్రె బుచ్చన్న జ్ఞాపకార్థం పుర్రె బుచ్చన్న ట్రస్ట్ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు వారి కుటుంబీకులు హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మారిశెట్టి భద్రం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈరోజు పుర్రె బుచ్చన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.ఈ క్రమక్రమంలో మారిశెట్టి భద్రం, వెంట్రప్రగడ శ్రీరామమూర్తి,వేములకొండ జోగరావు, దాపర్తి సీతారామయ్య, బోండా రాజేష్, పుర్రె వెంకటేశ్వర్లు, పుర్రె వీరసత్యనారాయణ, పుర్రే సూరన్న, పుర్రే వీర్రాజు, పుర్రే అర్జునరావు, చిక్కాల గొల్లబాబు, చిక్కాల లచ్చన్న, పుర్రే సత్తిబాబు, పుర్రే సత్యనారాయణ, పుర్రే సురేష్, మారిశెట్టి గంగ, కేంగం రామకృష్ణ, బొండా రాజేష్ ,కోడూరి రమేష్ , నేదూరి గణేష్, పలివేల యేసు, నాగిరెడ్డి అనిల్, కొండ్రోతు బుజ్జి, బచ్చు గోపి తదితరులు పాల్గొన్నారు.