21 October 2025
Tuesday, October 21, 2025

ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం స్వతంత్ర దినం రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలు ఆలపించి జండా వందనం చేశారు. చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేసిన కొండబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధులు త్యాగఫలం వల్లే ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు వంటి మహాత్ములు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నినుంచి ఇండియాని విముక్తి చేసి మనం స్వేచ్ఛావాయులు తీసుకునే విధంగా స్వాతంత్రాన్ని అందించారని కొండబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బోండా నూకబాబు, బోండా వీరసత్య, కంచర్ల శ్రీనివాసరావు, కొత్త శ్రీరామకృష్ణ, వి శ్రీరామ్మూర్తి, పి శంకర్, బొండాడ జగన్, మానేపల్లి రామానుజ, దుర్గపు ప్రకాష్, బోండా అయ్యప్ప, మాతంశెట్టి నారాయణ జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo