బూరుగుపూడి గ్రామంలో సామాజిక కార్యకర్త పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్య యాత్ర
నేటి బాలలే రేపటి పౌరులు అనే దృష్టితో గ్రామస్థాయిలో విద్యపై అవగాహన పెంపొందించేందుకు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రత్యేక చైతన్య యాత్ర చేపట్టారు. బూరుగుపూడి గ్రామంలోని పాఠశాల విడిచి ఉన్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్య ద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసం చేకూరుతుందని, మంచి పౌరులుగా ఎదగగలరని చెప్పారు.ప్రతి గ్రామంలోను బడికి వెళ్ళని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యపై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని, ఈ పని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన్ని డ్రాప్ అవుట్ రహితంగా తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.