29 November 2025
Saturday, November 29, 2025

ఉచిత బస్సు పథకం ప్రభావం..ఆటో కార్మికుల ఆవేదన

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేటలో నిరసన ర్యాలీ

తహసిల్దార్‌కి వినతిపత్రం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో జీవనోపాధి దెబ్బతిన్నందున తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు.తరువాత తహసిల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ గత పదేళ్లుగా ఆటో వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న తాము ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం అభినందనీయమే కానీ దాని వలన ప్రత్యక్షంగా దెబ్బతిన్న ఆటో కార్మికులకు ఉపశమన మార్గాలు చూపించడం అంతకంటే ముఖ్యమైనదని దీని వలన పేదరిక రేఖకు దిగువన ఉన్న ఆటో కార్మికులుకు రోజువారీగా తమకు దొరికే ఆదాయం కోల్పోతున్నాం అని వారు వాపోయారు.అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని కలసి తమ వేదనను వివరించనున్నట్లు తెలిపారు.ఈ నిరసనలో జగ్గంపేట, పరిసర గ్రామాల నుండి వచ్చిన వందలాది ఆటో కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo