01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

ఉప్పలపాటి వెంకటేశ్వరరావు (బుల్లెబ్బు).. ది.రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,

జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ది. రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్‌గా ఉప్పలపాటి వెంకటేశ్వరరావు (బుల్లెబ్బు) ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమానికి ముందుగా రాజపూడి సెంటర్లోని టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలవేసి, అక్కడినుండి వందలాది మంది కార్యకర్తలతో పాటు పాదయాత్రగా సొసైటీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.సొసైటీ సీఈవో పిల్లా అప్పారావు నూతన చైర్మన్‌కు స్వాగతం పలికారు. అనంతరం రిజిస్టర్ బుక్‌లో సంతకం చేసి ఉప్పలపాటి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ సభ్యులుగా చింతల కన్నారావు (జే.కొత్తూరు), గండికోట శ్రీను (మన్యం వారి పాలెం) ప్రమాణ స్వీకారం చేశారు.రాజపూడి గౌరీ శంకర్ కళ్యాణ మండపంలో రేఖ బుల్లి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలు పరిష్కరించి సొసైటీని అభివృద్ధి మార్గంలో నడిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ – ప్రస్తుతం రాజపూడి సొసైటీ 14 కోట్ల రూపాయల టర్నోవర్ వద్ద నిలిచిపోయిందని, దాన్ని 50 కోట్ల రూపాయల వరకు విస్తరించి, మరింత విస్తృతంగా రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన అవకతవకలను సరిచేసి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని నూతన చైర్మన్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో
ఎస్‌వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఆడప భరత్, జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు, వీరం రెడ్డి కాశీబాబు, పోతుల మోహనరావు, జడ్పిటిసి తోట గాంధీ, కందుల చిట్టిబాబు, సొసైటీ చైర్మన్లు బుర్రి సత్తిబాబు, తోట గాంధీ, కందుల కొండయ్య చౌదరి, కంటిపూడి సత్తిబాబు, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాజపూడి సర్పంచ్ బుసాల విష్ణుమూర్తి, బస్వా చినబాబు, తుమ్ కుమార్, కందుల విజయ్, సర్వసిద్ధి లక్ష్మణరావు, బీజేపీ నాయకులు కందుల అచ్యుతరామయ్య, జనసేన శివ, టిడిపి నాయకులు గనిశెట్టి సన్యాసిరావు, అనంతలక్ష్మి, నకిరెడ్ది సూర్యవతి, కమ్మిల వెంకన్న కాపు, కొల్లు రామకృష్ణ, పోత్రు కృష్ణ, పోత్రు రాముడు, కేసినిడి శ్రీను, బద్ది సురేష్, గళ్ళ శ్రీను, గుడివాడ రాజారావు, వల్లెపు అన్నవరం, అప్పన వీరబాబు, బత్తుల వెంకన్న, ముమ్మన దుర్గచందక రమణ, నంగన శ్రీను, బత్తుల గణేష్, కందుల సత్యనారాయణ, పెదగాడ శ్రీను, కందుల పూస కనకాల రామకృష్ణ, కోరాడ అబ్బు, డోకల శివ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo