నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పై హర్షం వ్యక్తం చేసిన నాయి బ్రాహ్మణలు
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యదర్శి సాంబేరపు వరప్రసాద్ ఆధ్వర్యంలో జగ్గంపేట నాయి బ్రాహ్మణ సంఘం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కలిసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయనందమూరి తారకరామారావు కి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి బిసి సెల్ కార్యదర్శి ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాయి బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నారని నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అందులో భాగంగా సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించి నాయి బ్రాహ్మణుల కుటుంబాలను ఆదుకున్నాయని అదే విధంగా ఆదరణ పథకం కూడా అందించి మాకు ఎప్పుడు అండగా ఉంటున్న టిడిపి మా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మల్లువలస ఈశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు, కే నూకరాజు, కే రాముడు (కృష్ణ), ఎం సుందరం, ఎస్ వీరకుమార్, ఎం మణికంఠ, కే జగదీష్, జి సతీష్, ఏ ప్రసాద్, కే శ్రీను, ఆర్ రమేష్, ఏ బుజ్జి, ఏ రాజేష్, ఎం రాజారావు, ఎం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

